#s2news #raghunandanrao #bjp
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరియు బిజెపి నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా సీఎం కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీలో మద్యం కుంభకోనానికి పాల్పడడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా నిరసన చేపడుతున్న బిజెపి నాయకుల పైన మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పాదయాత్రను భగ్నం చేస్తూ అక్రమ అరెస్టు చేయడం నిరసిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసులు, టిఆర్ఎస్ కార్యకర్తలు వీధి రౌడీలలాగా వ్యవహరిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అక్రమ అరెస్టు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన కూతురైన ఎమ్మెల్సీ కవిత 150 కోట్ల లిక్కర్ కుంభకోణానికి పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. మా కార్యకర్తలపై దాడి చేయడం, అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలించడం చేతకాకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన నాన్ బెయిలబుల్ కింద కేసులు పెట్టడం హేయమైన చర్య అన్నారు. అరెస్టు చేసిన బిజెపి చీఫ్ బండి సంజయ్ గారిని మరియు కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని అవినీతిని బయటపెడితే అరెస్టులు దాడులు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ,తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=8P7xMUdwkGU
దౌల్తాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న చేగుంట మండలం పులిమామిడి (కిష్టాపూర్) మాజీ సర్పంచ్ సీనియర్ జర్నలిస్ట్ బిజెపి నాయకులు శ్రీ నాయిని రాజగోపాల్ కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించిన దౌల్తాబాద్ ఎస్ఐ మీ చైతన్య కుమార్ రెడ్డి గారిని సన్మానించడం జరిగింది
...
https://www.youtube.com/watch?v=OtekLSttgjc