#doctor #health #officers
అనుమతి లేకుండా ఆసుపత్రి నడిపితే కఠిన చర్యలు తప్పవని పిఓఎన్సిడి వినోద్ బాబు హెచ్చరించారు . సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని సుధా , సంజీవని , వివేకానంద , అమృత హాస్పిటల్స్ లో జిల్లా వైద్య బృందంతో కలిసి తనిఖీలు నిర్వహించారు . జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేస్తామని తెలిపారు . దుబ్బాకలో అనుమతులు లేకుండా , సరైన వసతులు లేకుండా , అర్హత లేకుండా నడుపుతున్న హాస్పిటల్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు . ఆసుపత్రిలో జరుగుతున్న అన్ని వైద్య సేవలకు అనుమతులు పొందాలని సూచించారు . అనుమతి గడువు కాలం పూర్తై రినివల్ చేసుకోనివారికి మూడు రోజుల్లో అనుమతులు తీసుకోవాలని అవకాశం కల్పించామన్నారు . ఈ కార్యక్రమంలో డా . అజీం , తిమ్మాపూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవి వైద్య బృందం పాల్గొన్నారు .
...
https://www.youtube.com/watch?v=vuLEGWUqjOQ
#hamali #bjp #raghunandanrao
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుని కలిసిన దుబ్బాక హమాలీ సంఘం సభ్యులు
దుబ్బాక పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా నిర్మిస్తున్న హమాలీ సంఘం డబల్ బెడ్ రూమ్ పనులు నత్త నడికన సాగుతున్నాయని పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేపియాలని, తమలో కొందరికి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదని కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని దుబ్బాక పట్టణంలో హమాలీ సంఘం నాయకులు ఎమ్మెల్యే రఘునందన్ రావు తో విన్నవించారు. సానుకూలంగా స్పందించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు త్వరగా పూర్తి చేపిస్తానని హామీ ఇచ్చారు
...
https://www.youtube.com/watch?v=_zNV5Wwr_Mc