#bjp #mla #raghunandanrao
ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇచ్చిన మాటకు కట్టుబడి అక్బర్ పేట భూంపల్లి మండల ఏర్పాటుకు కృషి చేయడం జరిగిందని బిజెపి సీనియర్ నాయకుడు బిక్షపతి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్ పేట అతిధి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి హామీలు నెరవేర్చేందుకు ఎమ్మెల్యే రఘునందన్ రావు కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అవసరాలకు అనుగుణంగా అక్బర్పేట భూంపల్లి మండల ఏర్పాటు కోసం రఘునందన్ రావు చేసిన కృషి నియోజకవర్గ ప్రజలు మర్చిపోరన్నారు. నూతన మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే రఘునందన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన బిజెపి నాయకులు నవీన్, యాదగిరి పలువురు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=INyYIy3j6lQ