This song is part of Sudhanva Sankirtanam Devotional and Spiritual Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Music Director Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad : Telangana State : India : Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.
LYRICS : మహిమలు
పల్లవి : మహిమలు తెలుపగ, ఎంతటివారము, మేమెంతటివారం
మహీధరుని వర్ణింపగ ఎంతటివారం, మేమేపాటివారం "2"
చరణం : ఎన్ని జన్మల పుణ్య ఫలమో "2"
యింతటి కారుణ్య సంపద దొరిగెను
ఏ జన్మ వాసన ఫలితమో
ఈ పాటిదయను బడసితిమి "మహిమలు"
చరణం : పాపులకైనను పరమ దయాళువు "2"
పాపులను సైతము, కరుణించు దైవము
పాప కర్మలను శమియించు దైవము "2"
పాపులనైననూ, పరమపుణ్యులసేయును "మహిమలు"
This song is part of Sudhanva Sankirtanam Devotional and Spiritual Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Music Director Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad : Telangana State : India : Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.
LYRICS : NAANAATIKI
పల్లవి : నానాటికీ, ఏనాటికీ తిరమగు దైవము శ్రీధరు డొక్కడే
తిరమగు దైవము శ్రీధరు డొక్కడే "నానాటికీ"
చరణం : నాలుకల తేనెలూరు పదము పరమ పదమునకు, ఇది మార్గము
హరినామము, శ్రీహరినామము "2" ఇది నిజము, ఇక హరియే మన పధము "2"
శ్రీ హరి తప్ప, అన్య దైవమే లేడట "నానాటికీ"
చరణం : నాడును, నేడును, పుట్టుకలేని నిధియు, నిధానము, చేరువ దైవము
హరి ఒక్కడే, శ్రీ హరి ఒక్కడే "2" జగమంతయును, స్థితి లయలందునను "2"
సృష్టియె తానుగ, వెలుగును ఏనాడు "నానాటికీ"
This song is part of Sudhanva Sankirtanam Devotional and Spiritual Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Music Director Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad : Telangana State : India : Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.
తనకు మారుపేరుగా
పల్లవి : తనకు మారు పేరుగా గల
తనను మించిన వారుగా గల "2"
అ.ప : సత్పురుషులు, సత్ప్రవర్తనుల జఠరమునందునె
భగవానుడు జనియించు "తనకు"
చరణం : నిష్కాములు, నిశితాత్మకులును
స్తితప్రజ్ఞులు, సత్కర్మయోగులకు
కర్మాచరణులు, ధర్మాచరణులు
సత్యవచనులు, సత్యాత్మకులుగా
చరియించు జనుల, జఠరమునందుననే "2"
పసిపాపడిగా భగవానుడు జనియించును "తనకు"
చరణం : మనసా, వాచా, కర్మణా
తనను తాను అర్పించుకోగల
దేహచింతయే లేక, యిహమే పరమనుకొని
చరియించువారల, ఉదరముననె తమ బిడ్డగాజనియించి "2"
తాను తరించేనులె! వారిని తరియించి "తనకు"