This song is part of Sudhanva Sankirtanam Devotional and Spiritual Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Music Director Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad : Telangana State : India : Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.
LYRICS : AMBARAMANDINA
పల్లవి : అంబరమందిన అంబుజనాభుడే
మా, డెందము నిండిన, దామోదరుడే "2"
చరణం : అంతరంగముల, అచ్యుతుడే
అందరి మనసుల ఆనందుడే "2"
సుందర వదనుడే, సూర్య తేజుడే" 2"
మా అండదండగ ఉండేవాడు గోవిందుడే "అంబర"
చరణం : అద్భుతానంద నందనుడే
నందనానంద పరమాత్ముడే "2"
నీలాంబరుడటనే! నీలాలకేశవుడే
నీలలోచనుడే, నీలాసమేత గోవిందుడూ "అంబర"
This song is part of Sudhanva Sankirtanam Devotional and Spiritual Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Music Director Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad : Telangana State : India : Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.
నామమాత్రుడ
పల్లవి : నామ మాత్రుడ నేను,
నామాంకితుడవు, నీవు, హరీ! "2"
అ.ప : మధురామృతము బ్రోలు నీ నామామృతము
గ్రోలగ, మా జన్మ ధన్యము "నామ"
చరణం : అనుకూల, ప్రతికూల సమయమందునను, స్వామీ!
ఎంచక మానవ తప్పిదములను "2"
అసామాన్య, కరుణను కురిపించి
మమ్ముల గాచిన, ఆది దైవమా! "నామ"
చరణం : తలచిన వారలకు, తలచిన విధములుగ
వరముల నందించు, పురుషొత్తముడవు నీవు
తరతరాలకు లోటిడని దైవము "2"
భక్తులముంగిట నోముల పంటా! "నామ"
This song is part of Sudhanva Sankirtanam Devotional and Spiritual Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Music Director Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad : Telangana State : India : Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.
LYRICS : MAA PADAMULU
పల్లవి : మా పదములు, మా పలుకులు
నీ వరకే, నీ కొరకే "2"
అ.ప : మా గమనము, మా గమ్యము
నీ వరకే, చేరువకే "మాపదములు"
చరణం: మా చలనము, చేతనము
నీ కొరకే, నీ వరకే "2"
మా ఆరంభం, అంతిమము
నీ వరకే, చేరువకే "మా పదములు"
చరణం: మా స్పందన, బంధనము
నీ కొరకే, నీ వరకే "2"
మా జీవనము, జీవితము
నీ కొరకే నీ వరకే "మా పదములు" "2"
చరణం : మా భావన, ప్రేరణమూ
నీ కొరకే, నీ వరకే "2"
నీ ఆదరము, సాదరము
కావవి, మిత మనంతము "మా పదములు" "2"
This song is part of Sudhanva Sankirtanam Devotional and Spiritual Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Music Director Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad : Telangana State : India : Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.
LYRICS :
అలరాముడైననూ
పల్లవి : అలరాముడైనను, సరి బాలుడైనను
అమ్మ ఒడిలో హాయిగా నిదురబోవు
అ.ప : అల దైవమైనను, ఇల మనుజుడైనను
ఎంత ఎదిగినను, పసిబాలుడే తాను"
జో జో జో "2" "అల"
చరణం : పుడమి అయినను, స్వర్ణవూయలే ఐనను
పసిపాపలు, నిదురలొ పరవశింతురు
మహరాణికైనను, సామాన్య వతికైన
కన్న ప్రేమకు కొదవె వుండదు "అల"
చరణం : కడుపేదకైన, ధన, భూపతికి ఐనను
వాత్సల్యమునకు వారధి వుండదు "2"
జున్నుపాలైననూ, కటిక నీరైననూ
ఆకలికిబేధమసలుండదు "అల"
చరణం : సురపతులే ఐన, దైత్యులే ఐన
అధికులే మరి హీనులే ఐన
అవ్యాజ కరుణను జూపుటలో
జగమందు స్వామికి, సరిజోడి కనము "అల"
"జో "అచ్యుతానంద! జోజోముకుందా!
లాలిపరమానంద, రామ గోవిందా! జో జో!"