#teacher #students #school
సర్కార్ బడులలో చదవాలంటే గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా తమ పిల్లలను చదివించడానికి సుముఖత చూపని ఈ రోజుల్లో, బడిపంతులు చూపిస్తున్న అంకితభావానికి ఆ గ్రామస్తులే ఫిదా అయిపోయి ప్రైవేటు పాఠశాలకు పంపించడానికి నై అంటూ, సర్కార్ బడిలోకి పంపించడానికి సై అంటున్నారు.
ఇక్కడ మీరు చూస్తున్న ఈ బడి పంతులు పేరు కృష్ణమూర్తి.. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని మీరుదొడ్డి మండలం కాసులాబాద్ ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నాడు. అందరిలాగే ఈ ఉపాధ్యాయుడు కూడా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. పాఠశాలకు ఐదు నిమిషాల ముందు రావడానికి ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతుంటారు. కానీ ప్రతిరోజు ఉదయం 8 గంటలకే పాఠశాలలకు వచ్చి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా బోధన చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ బడిపంతులు కృష్ణమూర్తి. ట్యూషన్ ఫీజు తీసుకుంటున్నాడేమో అందుకే ముందస్తునారు అనుకుంటే పొరపాటే, విద్యార్థులను తల పిల్లలుగా భావించి వారి భవిష్యత్తు బంగారు బాటలు వేయడానికి వస్తుండడం ఆదర్శనీయం.. విద్యార్థులకు తనదైన శైలిలో సుమారు ఇప్పటివరకు వందకు పైగా పద్యాలను బోధించి శభాష్ అనిపించుకున్నాడు. పాఠశాలలోని ఏ విద్యార్థిని అడిగిన 40 నుండి 50 కి పైగా పద్యాలను అనర్గళంగా చెప్పడం విశేషం.. ఇలా అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు ఉంటే ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ఇలాంటి సర్కారు బడిలోకి పంపడానికి పంపించడానికి సుముఖత చూపుతారు అంటే అతిశయోక్తి కాదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా విద్యార్థుల కోసం ప్రతిరోజు ఉదయం 8 గంటలకే బడికి వస్తేనే, తనకు సంతోషంగా ఉంటుందని చెప్పడం కృష్ణమూర్తి స్పెషల్.. ఇలాంటి ఉపాధ్యాయులు ప్రతి చోట ఉండాలని కోరుకుందాం...
...
https://www.youtube.com/watch?v=cfNjNoMEMmY
దుబ్బాక మండలం అప్పనపల్లి లో మంత్రాల నెపంతో వృద్దురాలిపై హత్యా యత్నం ,ఘటన స్థలాన్ని సందర్శించిన ACP రామేశ్వర్.ఇద్దరిపై SC,STకేసు నమోదు చేసిన పోలీస్ లు
...
https://www.youtube.com/watch?v=qcq7xatz3_Q