#s2news #raghunandanrao #bjp
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రగోతంపల్లి గ్రామంలో మంగళవారం నాడు ఎమ్మెల్యే పర్యటించారు.గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఇల్లు కూలిపోయిన బాధితులను ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. ఇల్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇల్లు కూలిపోయిన బాధితులకు హామీ ఇచ్చారు. పురాతన ఇండ్లలో ఎవరు ఉండవద్దని సూచించారు. వర్షాలతో పాత ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఉన్న బాధితులను ఎమ్మెల్యే రఘునందన్ రావు వెళ్లి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూంలో మౌలిక సదుపాయాల తో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వెళ్లవద్దని సూచించారు. ఆయన వెంట దుబ్బాక ఎమ్మార్వో ఎండి సలీం మియా ,గ్రామ సర్పంచ్ రెడ్డి దేవి రెడ్డి, ప్రజా ప్రతినిధులు, బిజెపి నాయకులు పలువురు ఉన్నారు.
...
https://www.youtube.com/watch?v=O8eDocB0d9M
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=tluXOdV4G1A
#s2news #mrdmpp #gajjela
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఎంపీపీ సాయిలు అన్నారు. సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో నూతనంగా వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక సర్పంచ్ భారతి భూపతి గౌడ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గ్రామంలో నీటి ఎద్దడిని తీర్చేందుకు నిధులు మంజూరు చేయడంతో నేడు ప్రజాప్రతినిధులు గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మండల వ్యాప్తంగా ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి లక్ష్యంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పని చేయడం సంతోషకరమన్నారు. పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మండలంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మిరుదొడ్డి మండలం అభివృద్ధికి ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి మరింత కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి లక్ష్మీ లింగం, వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, ఏ ఏం సి చైర్మన్ సత్యనారాయణ, టిఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి పలువురు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=N9AV7vFRa1c